(Local) Tue, 28 Jan, 2020

పైరవీల పర్వం...

January 14, 2019,   3:16 PM IST
Share on:
పైరవీల పర్వం...

ఈ నెల 17న తెలంగాణ ఈసెంబ్లీ సంమావేశాలు ప్రారంభ‌మ‌వుతుండ‌టంతో కాంగ్రేస్ నేత‌ల్లో హ‌డావుడి ప్రారంభ‌మైంది. కాంగ్రేస్ లెజిస్లేటీవ్ ప‌ద‌వి కోసం, ఇటు (సీఏసీ) ప్ర‌జా ప‌ద్దుల చైర్మ‌న్ ప‌దవి కోసం నాయ‌కులు పైర‌వీల్లో త‌లమున‌క‌లైనారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ పద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు కాంగ్రేస్ అధిష్టానం క‌స‌ర‌త్తు ప్రారంబించిది. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన నాయ‌కులు త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో డిల్లీలో త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎప్పుడుగాని ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వారం రోజుల్లోపు ఈ ప‌ద‌వుల నియామ‌కం ప్ర‌క్రియ పూర్త‌య్యేది. కాని ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు నెల రోజులు కావ‌స్తున్న గెలిచిన ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నే లేదు. డిసెంబ‌ర్ 13న టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రిగా మ‌హ‌మూద్ అలి ఒక్క‌రు మాత్ర‌మే ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ అసంబ్లీని ఏర్పాటు ప‌ర‌చ‌క పోవ‌డంతో ఎంఎల్యేల ప్ర‌మాణ స్వీకారక‌ర్య‌క్ర‌మం ఆల‌స్యం అయింది. ఈ నెల 17న అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌నున్న నేప‌ధ్యంలో ఈ ప‌ద‌వుల నియామ‌కానికి సంబందించి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రేస్ అధిష్టానం ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.శాస‌న స‌భ స‌మావేశాల‌కు ఒక్కరోజు ముందు ఈ నెల 16న కాంగ్రేస్ శాస‌న స‌భాప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన వ్య‌క్తిని ఎన్నుకోనున్నారు.
సీఎల్పీ నేత‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి...?
ఇటీవ‌లి వ‌ర‌కు సీఎల్పీ నేత‌గా సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ మంత్రి కె జానారెడ్డి ఉన్నారు. అనూహ్యంగా ఆయ‌న ఓట‌మిపాల‌వ‌డంతో ఈ ప‌దవికి భారీగానే డిమాండ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ నాయ‌కులు బ‌ట్టి విక్ర‌మార్క దుద్దిళ్ళ‌ శ్రీ‌ధ‌ర్ బాబు గండ్ర వెంక‌ట ర‌మ‌ణా రెడ్డితో పాటు హోం శాఖ మాజీ మంత్రి చేవెళ్ళ చెల్లెమ్మ స‌బిత ఇంద్రారెడ్డిలు పోటీ ప‌డుతున్న‌ట్టు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాభ‌వం చెందినందున టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నుండి ఉత్తమ్‌ను త‌ప్పించాల‌ని డిమాండ్ వ‌స్తున్న నేప‌ధ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ కాంగ్రేస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హుజూర్ న‌గ‌ర్ నుండి గెలుపొందిన ఆయ‌న‌ను సీఎల్పీ నేత‌గా అధిష్టానం ఆదేశించే అవ‌కాశాలు వున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు పేర్కోంటున్నాయి. ఇక ఉత్త‌మ్‌ని సీఎల్పీ నేత‌గా నియ‌మించే క్ర‌మంలో త‌న‌కు ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాలంటూ త‌న‌కున్న ప‌రిచాల‌తో అధిష్టానం పెద్ద‌ల వ‌ద్ద ప్ర‌య‌త్నాల‌ను ప్రారంబించిన‌ట్టు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్య‌క్షుడిగా కోమ‌టిరెడ్డి...? 
ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాభ‌వం చెందినందున తెలంగాణ కాంగ్రేస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పించాల‌ని ప‌లువురు నేతలు డిమాండ్ చేస్తున్న నేప‌ధ్యంలో వారి డిమాండ్ అనుగుణంగా కాంగ్రేస్ అధిష్టానం మొగ్గు చూపిన ప‌క్షంలో  ఆ పద‌వి కోసం గ‌త కొంత కాలంగా ఎదురు చూస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ త‌న ప్ర‌య‌త్నాల‌కు ప‌ద‌ను పెడుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ జిల్లాలోని కోమ‌టి బ్ర‌ద‌ర్స్ కి పార్టీలో మంచి ప‌ట్టుంది. దానికితోడు రాజ‌గోపాల్ రెడ్డికి కొంత దూకుడు త‌త్వం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని, ఇటు సీఎం కేసీఆర్ ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలంటే ఆ దూకుడు స్వ‌భావం వుంటేనే అది సాధ్యం అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు సైతం అంగాక‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న సైతం అధిష్టానం వ‌ద్ద ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప‌లువురు సీనియ‌ర్లు పార్ల‌మెంట్ వైపు..!
గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ప‌లువురు సీనియ‌ర్లు ఓట‌మిపాల‌వ‌డంతో ఇప్పుడు వారి చూపు పార్ల‌మెంట్ వైపు మ‌ళ్లుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది, దాంతో తాము ముఖ్య‌మంత్రిని కావ‌చ్చ‌నే ఆశ‌తో ఇంతకాలం అసెంబ్లీకి పోటీ చేస్తూ వ‌చ్చారు. ఇటు పార్టీ అటు వారుసైతం ఘోర ప‌రాభ‌వం చెంద‌డంతో ఇక మిగిలింది పార్ల‌మెంట‌నే మైండ్ సెట‌ప్ అయిన‌ట్టు తెల‌సుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులుగా అధిష్టానం పెద్ద‌ల వ‌ద్ద త‌మ‌కున్న ప‌రిచ‌యాల‌తో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నికల బ‌రిలో నిల‌వాల‌ని పైర‌వీలు ప్రారంభించారు. ఏదిఏమైనా ప‌ద‌వి ఏదైనా త‌మ‌కున్న ప‌రిచాల‌తో ప‌ద‌వులు ద‌క్కించుకోవాల‌ని కొంద‌రు, ఓడిపోయినవారు పార్ల‌మెంట్ టికెట్లు తెచ్చుకునేందుకు డిల్లీకి కూ క‌డుతున్న‌ట్టు గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.