(Local) Fri, 05 Jun, 2020

పాలిటిక్స్ లో పవన్ రూటే సపరేట్...!

May 17, 2019,   2:29 PM IST
Share on:
పాలిటిక్స్ లో  పవన్ రూటే సపరేట్...!


పాలిటిక్స్‌లో ప‌వ‌న్ రూటే స‌ప‌రేటు.  ఇప్ప‌టి వ‌ర‌కు అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన ఎంతో మందికి జ‌న‌సేనానికి ఎంతో తేడా వుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.  అధికార‌మే అంతిమ ల‌క్ష్యం కాదంటూ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న..  ప్ర‌జాగొంతుక‌నే త‌న గొంతుక‌గా జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డారు.   కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని కాద‌ని స‌మాజంలో సామాన్యుని స్వ‌రంగా నిలిచారు.   మ‌రో వారంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు రానుండ‌గా  ప‌వ‌న్ ప‌ని అయిపోయిందంటూ ఒక వ‌ర్గానికి చెందిన మీడియా ప్ర‌చారం మొద‌లెట్టేసింది.   ఇలాంటి ఊక‌దంపుడు ప్ర‌చారాల‌ను జ‌న‌సైన్యం ధీమాగా తిప్పికొడుతోంది.  


కుటిల రాజ‌కీయాల‌కు చెక్ 

దీనిని చూసి ఓర్వ‌లేని అధికార‌, విప‌క్షాలు కుటిల రాజ‌కీయాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఏపిలో కౌంటింగ్ త‌ర్వాత ప‌వ‌న్ ప‌ని అయిపోతుందంటూ విష ప్ర‌చారం చేస్తున్నాయి.   ఇక సినిమాలు చేసుకుంటాడంటూ పిచ్చి ప్రేలాప‌న‌లు మొద‌లెట్టాయి.  అయితే ఇటు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టిడిపి అధినేత చంద్ర‌బాబు,  అటు వైసిపి అధినేత జ‌గ‌న్ కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారా అంటూ సామాన్యులు ప్ర‌శ్నిస్తున్నారు.  వారి వారి వ్యాపారాల‌ను ప్ర‌వృత్తిగా  కొన‌సాగిస్తూనే  కోట్లు గ‌డించ‌డం లేదా అంటున్నారు.  ఇప్ప‌డు జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం  సినిమాలు చేస్తే త‌ప్పేంట‌ని నిల‌దీస్తున్నారు. అయినా రాజ‌కీయాల‌లో కొన‌సాగుతూ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని ఏమైనా వుందా..!


మీరూ వ్యాపారాలు వ‌దిలేస్తారా .. ?

నేత‌ల్లారా   వ్యాపారాలు వ‌దిలేసి ప్ర‌జాక్షేత్రంలోనే ఉండి మ‌న‌ల‌ను న‌మ్ముకున్నప్ర‌జ‌ల‌కు సేవ చేద్దాం రండి  అంటూ స‌వాల్ విసిరారు జ‌న‌సేనాని.   మీరు వ్యాపారాలు వ‌దిలేస్తారా...?  నేను నా సినిమాలు వ‌దిలేస్తా అంటూ  చుర‌క‌లంటించారు.  దీంతో ఖంగుతిన్న ఆ పార్టీల శ్రేణులు తోక‌ముడిచాయి. ఫ‌లితాల‌ను త‌మ‌కే అనుకూలంగా చెప్పుకొంటూ అధికార , విప‌క్షాలు కాలం గ‌డిపేస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు జాతిలో నిశ్శ‌బ్ద విప్ల‌వానికి  ఈ సార్వ‌త్రిక ఎన్న‌క‌లు నాంది ప‌లికాయంటే ... అది ఎవ‌రివ‌ల్లో ఇప్ప‌టికే ఆ యా పార్టీల‌కు అర్ధ‌మ‌యి పోయింది.  అధికార‌, విప‌క్ష పార్టీల‌కు కునుకు లేకుండా చేసిన ఈ ఎన్నిక‌లు చ‌రిత్ర‌పుట‌ల్లో ఒక మైలురాయిగా నిలిచాయంటే అది జ‌న‌బ‌లంతో వ‌చ్చిన జ‌న‌సేన‌దే అనేది న‌గ్న‌స‌త్యం . 

జ‌న‌బ‌లం  జ‌న‌సేన‌దే

ఏ రాజ‌కీయ పార్టీ అయినా..   పోటీ చేసిన అభ్య‌ర్ధులెవ‌రైనా..  ఎన్నిల‌ప్పుడే ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు వ‌స్తారు.    ఓట్లు అయిపోగానే  వాళ్లే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చినా ప‌ట్టించుకోరు.    కాని త‌మ‌కు పద‌వులు ముఖ్యం కాదు..  ప్ర‌జాక్షేమ‌మే త‌మ ల‌క్ష్యం అంటూ ఎన్నిక‌లు,  ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా  మెరుగైన రాజ‌కీయాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది జ‌న‌సేన పార్టీ.    ఇప్ప‌టికీ పార్టీ అధినేత‌తో పాటు ...   జ‌న‌సేన పార్టీ నుండి పోటీ చేసిన అభ్య‌ర్ధులు సైతం ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటూ  స్థానిక స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే వున్నారు.    ఇదీ మార్పు అంటే...  కోట్ల కొద్ది డ‌బ్బులు త‌మ వ‌ద్ద లేవు,.  ప్ర‌జల‌నే న‌మ్ముకున్నాం..  వారి కోసం నిరంత‌రం పోరాటాలు చేస్తాం..   ప్ర‌జాపాల‌న అందిస్తాం అంటూ హామీలిచ్చిన‌ జ‌న‌సైనికులు...   ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా  ప్ర‌జాక్షేత్రంలో త‌మ‌దైన ముద్ర వేసుకుంటున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.