(Local) Fri, 13 Dec, 2019

మీ కాళ్ళు మొక్కుతాం బాంచెన్...!

November 26, 2018,   5:33 PM IST
Share on:
మీ కాళ్ళు మొక్కుతాం బాంచెన్...!

భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం నిజాం నిరంకుశత్వ పాలనను వ్యతిరేకిస్తూ యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై కదం తొక్కారు.  ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా పోరాటం చేశారు.ఈ  పోరాటంలో దాదాపు నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోపోయినా మడమ తిప్ప కుండా  రజాకార్లకు ఎదురొడ్డి పోరాడారు. ఎంత కాలం బాంచెన్ దొర కాళ్ళు మొక్కుతాం అని బ‌తుకుతాం, క‌ష్టం చేస్తేనే మ‌న‌కు డ‌బ్బులిస్తున్నారు. అలాంట‌ప్పుడు వారికి ఎందుకు స‌లాం కొటాలంటూ నాటి ప‌ట్వారీ, దొర‌ల, దేశ్‌ముఖ్ ల  పాల‌న పై ఎదురించి పొరాటానికి న‌డుం బిగించిన‌  చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్యల నేతృత్వంలో చేస్తున్న పోరాటాని, నాటి ఆంధ్ర మ‌హాస‌భ కార్య‌క‌ర్త‌లు, క‌ర‌డు క‌ట్టిన క‌మ్యూనిస్ట్ నాయ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ తెలంగాణ సాయుథ పోరాటంగా ఉద్యమాన్ని ఉదృతం చేశారు, అప్పటికే 1947 అఘ‌స్టు 15న భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాని హైదరాబాద్ సంస్థానం మాత్రం   నిజాంల పాలన లో ఉండేది. అప్పటి భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు, రక్షణ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం సైన్యంపై సైనిక పోరాటం చేశారు. ఇటు సైనిక పోరాటం , అటు తెలంగాణ సాయుధ పోరాటానికి ఎదుర్కో లేక నిజాం నవాబు తల వంచక తప్ప లేదు. చివరకు  హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారు. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం ఏర్పడంది. కాని ఇప్పుడు హైదరాబాద్ ను  మరో నిజాం నవాబు పాలిస్తున్నాడా..? అంటే అవుననే అనుమానం కలుగుతుంది. హైదరాబాద్ పాత బస్తీని తమ కను సన్నల్లో పాలన కొన సాగిస్తున్న ఆల్ ఇండియా మజిలిస్ ఇత్తెహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నేతల అక్బరుధ్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖలు అందుకు అద్దం పడుతున్నాయి.

ఎవరైనా తల వంచాల్సిందే..?

ముఖ్యమంత్రి ఎవరైనా తమ ముందు  తల వంచాల్సిందే నంటూ ఎంఐఎం పార్టీ అంర్గ‌త సభలో ఆ పార్టీ నేత ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి.  ఉమ్మడి ఆంద్రప్రధేశ్ ముఖ్యమంత్రులుగా గతంలో పని చేసిన టీడీపీ అధినేత, ప్రస్థుత ఏపీ సీఎం చంద్రబాబు, గతంలో ముఖ్యమంత్రులుగా  పని చేసిన   డా.రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తో  సహా ప్ర‌స్థుత తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం అందరూ తమ ముందు తల వంచాల్సిందే అంటూ ఘాటుగా విమర్శించారు.

అల‌జ‌డి సృస్టిస్తున్న అక్బ‌ర్ వ్యాఖ్య‌లు:

తెలంగాణ‌లో ఎవ‌రు పీఠంపై కూర్చోవాలో నిర్ణ‌యించేది మేమేనంటూ ఎంత‌టి వారైనా త‌మ‌కు స‌లాం కొట్టాల్సిందేనంటూ ఎంఐఎం నేత అక్బ‌రుద్ధీన్ ఒవైసీ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి సృష్టిస్తున్నాయి.

నిజామాబాద్ లో జ‌రిగిన ఆ పార్టీ స‌మావేశంలో కూడా మ‌త చాంద‌స్స మాట‌లు మాట్లాడుతూ హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వాఖ్య‌లు చేశారు. దీంతో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. ఫ‌లితంగా ఆయ‌న జైలు శిక్షను అనుభ‌వించారు. తాజాగా ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు ఎంఐఎం అహంకారానికి అద్దం ప‌డుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యానాల‌ను టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం జీర్ణించుకో లేక పోతున్నాయి.ఈ విష‌య‌మై వారు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 

స్పందించ‌ని సీఎం :

టీఆర్ఎస్‌ని కాని, ఆ పార్టీ నాయ‌కుల‌ను విమ‌ర్శంస్తే ఒంటి కాలిపై లేచే కేసీఆర్ తాజా వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో  స్పందించ‌క పోవ‌డం మౌనం అర్ధ అంగీకార‌మా... ? ఆంధ్రులు, సెటిర్‌లు అంటూ నిత్యం నోరు పారేసుకుంటున్న టీఆర్ఎస్ నాయ‌కులు, మా జోలికి వ‌స్తే ఊరుకునేది లేదంటూ ,గతంలో చంద్ర‌బాబు త‌మతో పెట్టుకున్నందుకే ఆయ‌న‌ను రాష్ట్రం నుంచి పంపించాం అంటూ గొప్ప‌లు  చెప్పుకునే కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు సైతం ఆందోళ‌న చెందుతున్నాయి. తెలంగాణ ను చూస్తే నా క‌డుపు త‌రుక్కుపోతుందంటూ  మేడ్చ‌ల్ స‌భ‌లో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్య‌ల మ‌రుస‌టి రోజునే స్పందించిన కేసీఆర్ కు ఈ మాట‌లు విన‌ప‌డ‌టం లేదా లేక కావాల‌నే సైలెంట్‌గా ఉంటున్నారా, ఇది వ్యూహాత్మ‌క మౌన‌మా...?  పోరాటాల‌తో తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదంటూ  మ‌ల్కాజిగిరిలో జ‌రిగిన మీటింగ్‌లో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం మ‌ట్లాడిన దానికి అర డ‌జ‌న్ మంత్రులు ప్రెస్ మీట్‌లు పెట్టి మ‌రీ ఖంఢించారు. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నేత‌ల‌పై అందులో కేసీఆర్ సైతం మా ముందు త‌ల వంచాల్సిందే అంటూ అక్బ‌ర్ చేసిన  వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీలోని మంత్ర‌లు కేటీఆర్ , హ‌రాష్ రావులు సైతం ఖండించ‌క పోవ‌డం దేనికి సంకేంతం ..?  సీఎం స్థాయి నాయ‌కులపైనే ఘాటుగా విమ‌ర్శ‌లు చేసిన ఎంఐఎం నాయ‌కులు ఇక పాత బ‌స్తీలోని  సాధార‌ణ హిందువుల ప‌రిస్థితి  ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

ఆత్మాభిమానం కంటే అధికార‌మే ప‌ర‌మా వ‌ధి..?

అక్బ‌రుద్ధీన్ ఘాటైన విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్ట‌లేక పోయిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో లోపాయకార ఒప్పంద‌మా...?డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్లు రాక క‌ర్నాట‌క త‌ర‌హాలో హాంగ్ ఏర్ప‌డే నేప‌థ్యంలో ప్ర‌తి ఎమ్మెల్యే ఓటు ఎంతో విలువైన‌ది. ఈ నేప‌ధ్యంలో పాత బ‌స్తీలో ఎంఐఎంకు 5 నుండి 7 సీట్లు త‌ప్ప‌క వ‌స్థాయి అనుకుంటున్న త‌రుణంలో వారి మ‌ద్ద‌తు అవ‌స‌రం వుంటుంద‌ని, మ‌రోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ ఓట్లు కోల్పోతామ‌ని వారి మాట‌ల‌కు నాయ‌కులు త‌ల వంచితే నాటి నిజాం పాల‌న‌లో కాళ్ళు మొక్కుతాం బాంచెన్ అన్న చందంగా నేటి ఈ న‌వాబుల‌కు త‌ల వంచ‌క త‌ప్ప‌దు. ఇక‌పోతే నాటి చంద్ర‌బాబు నుండి మొద‌లుకుని నేటి కేసీఆర్ వ‌ర‌కు అధికార‌మే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ త‌మ బ‌లం పెంచుకునేందుకు అంద‌రూ ఎంఐఎంతో అంట కాగ‌డంతో నేడు ఎంఐఎం నేత‌లు ఇలా రెచ్చి పోవ‌డానికి ప‌రోక్షంగా కార‌కులు అయ్యార‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ మ‌ఖ్త కంఠంతో ఖండించాల‌ని లేనిచో ఇరు మ‌తాల మ‌ద్య గొడవ‌ల‌కు దారి తీసే అవ‌కాశం వుంటుంద‌ని వారు కోరుతున్నారు.

 

 

 

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.