(Local) Fri, 05 Jun, 2020

వ‌ల‌స‌ల జిల్లా నేడు కొలువుల ఖిల్లా

January 29, 2019,   12:36 PM IST
Share on:
వ‌ల‌స‌ల జిల్లా నేడు కొలువుల ఖిల్లా

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనంత‌పురం జిల్లాలో చుక్క నీరు ల‌భించ‌క, పంట‌లు పండ‌క నిత్యం క‌రువు కోర‌ల్లో కొట్టుమిట్టాడేది. తిన‌డానికి తిండి లేక చేతినిండా ప‌ని లేక వ్య‌వ‌సాయ కూలీలు, నిరుద్యోగులు సైతం పొట్ట‌కూటి కోసం అటు బెంగుళూర్ లేదా హైద‌రాబాద్ లాంటి ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల బాట ప‌ట్టేవారు. కాని రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మాని ఇప్ప‌టి 13 జిల్లాల‌తో కూడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృధ్ధిలో దూసుకు పోతుంది. అందులోబాగంగా నేడు వ‌ల‌స‌ల‌కు నిల‌య‌మైన అనంత జిల్లా నేడు కొలువుల కోసం రా ర‌మ్మని పిలుస్తోంది. ఒక్క జిల్లా వాసుల‌కే కాక ఇత‌ర దేశాల‌కు చెందిన నిసుణులు, నిరుద్యోగుల‌కు కొలువులిచ్చేందుకు సిద్దంగా వుంది.

కార్ల కంపెనీ రాక‌తో ద‌శ తిరిగిన అనంత :

విభ‌జ‌న పుణ్య‌మాని అభివృధ్ధిలో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు రావ‌డం శుభ సుచ‌కం, కొత్తగా 13 జిల్లాల‌తో ఏర్పాటైన రాష్ట్రం కావ‌డం, ప‌లు రాయితీలు వ‌స్తాయ‌ని ప‌లు కంపెనీల చూపులు ఏపీ పై ప‌డింది. దీనిని అందిపుచ్చున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు కియా కంపెనీని ఇక్క‌డికి ర‌ప్పించ‌డంలో స‌ఫ‌ల‌మైనాడు. అప్ప‌టికే గుజ‌రాత్‌,మ‌హారాష్ట్ర‌,త‌మిళ‌నాడు రాష్ట్రాలు పోటీ ప‌డ‌గా బెంగుళూర్ నుండి హైద‌రాబాద్ ,చెనై నుండి బెంగుళూర్, విశాఖ నుండి బెంగుళూర్ రూట్ల‌లకు ప్ర‌ధాన కేంద్ర‌బిందువుగా అనంత వుండ‌టంతో చివ‌రికి కియా మోట‌ర్స్ అధికారులు అనంత‌ను సెల‌క్ట్ చేశారు. దీంతో 2017 ఏప్రిల్ 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కియా(కేఐఏ) మోటార్స్ కార్పొరేషన్(ప్రస్తుత కేఎంఐపీఎల్) మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది.

కియకు తోడుగా మరో 16 సంస్థలు :

అనంతపురం జిల్లా ఎర్రమంచిలో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ కియ తన కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించిన వెంటనే, ఆ సంస్థకు అనుబంధంగా మరో 16 కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సంస్థలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందాలను చేసుకుంది. ఎర్రమంచిలో 574, గుడిపల్లిలో 71 ఎకరాలను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. కార్ల ఉత్పత్తిలో కియా మోటార్స్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ద‌క్ష‌ణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కార్ల ఉత్పత్తి యూనిట్ ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగ మార్కెట్లో ఒకటైన భారత్ లో కియా మోటార్స్ 13 వేల కోట్ల‌మేర పెట్టుబడులు పెట్టి త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది. అందులో బాగంగా ఏడాదికి 3 లక్షల యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇండియా రోడ్ల‌పై ర‌య్ మ‌న‌నున్న కియా :

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ త్వరలోనే కియా కారును మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. ఈ వాహనాన్ని ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన‌ ఆటో ఎక్స్ పో 2018లో ప్రదర్శనకు ఉంచింది. 2019 న‌వంబ‌ర్ నెల‌లో కియా మోటార్ కు చెందిన కాన్సెప్ట్ కంపాక్ట్ ఎస్యూవీ భారత మార్కెట్లోకి ప్ర‌వేశ పెట్టాల‌నుకుంది. భారతీయుల కోసమే ప్రత్యేకంగా ఈ వాహనాన్ని తయారు చేస్తున్నట్లు కంపెనీ కియా మోటార్స్ ఇండియా గ్రూప్ హెడ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు. తొలి కారును అనంతపురం కార్మికులే తయారు చేశారు. ఈ కారుకు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయ్యిందని కంపెనీ తెలిపింది. కాగా కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుకొండలో మ్యానుఫ్యాక్షరింగ్ యునిట్‌ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ తొలి కారును జనవరి 29న మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కారు ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్లోకి తీసుకు రావాలని కియా మోటార్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగానే అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ యంత్రాలు ఉపయోగిస్తోంది.  దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్‌ అనుంబంధ సంస్థలుగా ప్రసిద్ధి చెందిన 16 కంపెనీలు రూ. 4790 కోట్ల పెట్టుబడులతో, వెనుకబడ్డ అనంతపురం జిల్లాలోని 6583 మంది యువతకు ఉపాధిని కల్పించేందుకు ముందుకు రావడంతో ఇక అనంత కొలువుల నిలంగా మార‌డంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.