(Local) Fri, 13 Dec, 2019

కింగ్ మేకర్స్

December 03, 2018,   3:03 PM IST
Share on:
కింగ్ మేకర్స్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ఒక్కటే టెన్షన్, ఈ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంక్ ఎవరి వెంట వుంటారు. ఏ పార్టీ నాయకుడిని కదిలించినా ఇదే చర్చ. తమ పార్టీ అభ్యర్ధులు గెలుపు ఓటములపై హై టెన్షన్, అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష ప్రజా కూటమి, పార్టీలు ఏవైనా ఆందోళన ఒక్కటే, తమ ఓటు బ్యాంక్ చీలకుండా పలు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా  పలు పార్టీల్లో రెబల్స్ గుబులు పుట్టిస్తున్న అంశం నీడలా వెంటాడుతూనే ఉంది. ఒక్కో నియోజక వర్గంలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ముగ్గురు నలుగురు ఉండడంతో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు వేడి తగిలింది. జంప్ జలానీల రాకతో ఇది కాస్త మరింత రాజుకుంది. దీంతో పలు పార్టీలుకు కొరక రాని కొయ్యలా రె..బెల్ మోగించారు. వారిని తమ దారికి తెచ్చుకునేందుకు వారిపై అన్ని అస్రాలు సందించారు. నయానా బయానా అన్ని ప్రయత్నాలను ఆయా పార్టీల అగ్ర నాయకత్వం ప్రయోగించారు. చివరకు వారిపై సస్పెన్ష్ వేటు వేశారు. ఇక చేసేది లేక తమ ఓటు బ్యాంక్ చీలకుండా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయినా ఇంత కాలం ప్రజల్లో ఉండి వారి మన్నలు పొంది టికెట్ రాక ఇండిపెండెంట్‌గా బరిలో వున్న పలువురు నేతలు ఆయా నియోజక వర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం వుంది.

రె..బెల్ :
 పలు పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న ఆశా వహులు అధికంగా ఉండటంతో  అన్ని పార్టీల నుండి రె...బెల్ మోగించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంత కాలం పార్టీని అంటి పెట్టుకుని , పార్టీల జెంఢాలు మోసిన తమను కాదని జంప్ జ‌లానీల‌కు ఆయా పార్టీల బీ ఫాం ఇవ్వడంతో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్స్ ద‌డ‌ పుట్టిస్తున్నారు. 119 అసెంబ్లీ స్థానాలున్న  తెలంగాణలో 1821 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అందులో 655 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుండి రెబల్స్ గా బరిలో ఉన్న వారే. 2004 లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించేందుకు కాంగ్రేస్ టీఆర్ఎస్ పార్టీలు పొత్తు  పెట్టుకున్నాయి. అందులో బాగంగా ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశించి బంగ పడ్డ పలువురు నాయకులు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. అందులో 11 మంది విజయం సాధించారు. 2009లో సైతం రెబల్స్ గా బరిలో ఉన్నవారి లో 12 మంది గెలిచారు. ఎన్నికల అనంతరం ఏ పార్టీ నుండి రెబల్స్ గాబరిలో నిలిచి, విజయం సాధించారో వారిని ఫ‌లితాల అనంత‌రం ఆయా పార్టీల్లో చేర్చుకున్నారు. 2014లో సైతం 37 మంది అభ్యర్థులు రెబల్స్ గా పోటీ చేశారు. కాని ఈ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ శాసన సభలో బలం పెంచుకునేందుకు టీడీపి, కాంగ్రేస్ నుండి గెలిచిన 30 మంది ఎమ్మెల్యేలను అడ్డ‌గోలుగా కొనుగోలు చేసి తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇతర పార్టీల నుండి వచ్చిన జంప్ జలానీలకు టికెట్ ఇవ్వద్దంటూ నిర‌స‌న సెగ‌లు ఆకాశాన్ని అంటాయి. టీఆర్ఎస్ పార్టీలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులు అధినాయ‌క‌త్వాన్ని ధిక్క‌రించి రంగంలో నిలిచారు. అలాగే టీడీపి కాంగ్రేస్ సీపీఐ తెలంగాణ జన సమితి పార్టీలు  పొత్తులో బాగంగా ఆయా స్థానాల్లో టికెట్ ఆశించి భంగ పడ్డ వారు కూడా రెబల్స్ గా బరిలో నిలిచారు.
అర్థం కాని జనం నాడి :

నగరంలో పలు  రాజకీయ పార్టీల అగ్ర నాయకులు పచారంతో హోరెత్తిస్తున్నారు. రోజుకు 6 నుండి 10కి  పైనే స‌భ‌లు,  పలు కాలనీల్లో , ప్రధాన రహ దారుల్లో రోడ్ షోలతో, ఆయా పార్టీ శ్రేనుల్లో జోష్ పెంచుతున్నారు. అన్ని పార్టీల సభలు, రోడ్ షోలకు జనం భారీగా తరలి వస్తున్నారు. అన్ని సభలను సక్సెస్ చేస్తున్నారు. దీంతో జనం నాడి అర్ధం కాక ప్రధాన ప్రార్టీలు తలలు పట్టు కుంటున్నాయి. పార్టీలను చూసి ప్రజలు ఓటు వేస్తారా..?  లేదా ప్రజాదరణ వుండి టికెట్ రాక భంగ పడి రెబల్స్ గా బరిలో ఉన్న అభ్యర్థులను చేరదీస్తారా..? బొటాబొటి మెజార్టీతో  ఏ పార్టీ అయినా అధికారం చేజిక్కునే అవకాశం వుందని ఇప్పటికే పలు సర్వేలు చెపుతున్న నేపధ్యంలో విజయం సాధించిన రెబల్స్ కీ రోల్ పోషించే అవకాశం వుంటుంది. ఈ ఎన్నికల్లో జనం నాడి ఎలా వుండ బోతుందో తెలియాలంటే.. డిసెంబర్ 12 వరకు వేచి చూడాల్సిందే.
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.