(Local) Mon, 23 Sep, 2019

నా రాజ్యానికి నేనే రాజు... నేనే మంత్రి

February 16, 2019,   1:44 PM IST
Views: 247
Share on:
నా రాజ్యానికి నేనే రాజు... నేనే మంత్రి

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ ప్రాంత ప్ర‌జ‌ల దశాబ్దాల క‌ల, దానిని పాల‌కులు వారి స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకున్నారు. కాని ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ఏనాడు పట్టించున్న పాపాన పోలేదు. ఉద్య‌మాలు చేయ‌డం వాటిని నీరుగార్చ‌డం ఆ నాటి నాయ‌కులు చేసిన కుట్ర‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇది మ‌రింత తీవ్ర రూపం దాల్చింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009, కేసీఆర్ స‌చ్చుడో తెలంగాణ వ‌చ్చుడో అంటూ... నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి లాంటి వాటితో ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లారు. 
మొద‌టి ఉద్యమ చ‌రిత్ర :
1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందంను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అలా ప్రారంభ‌మైన ఉద్య‌మం మ‌లిద‌శ‌లో తీవ్ర‌రూపం దాల్చింది. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇది మ‌రింత తీవ్ర రూపం దాల్చింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009, కేసీఆర్ స‌చ్చుడో తెలంగాణ వ‌చ్చుడో అంటూ... నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష చేశాడు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి లాంటి వాటితో ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లారు. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవ‌త‌రించింది. 
తొలిసారి టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఏర్పాటు :
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉద్య‌మ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ బొటాబొటి మెజార్టీతో అధికారాన్ని చేజిక్కుంది. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీని ప‌ఠిష్ఠం చేయాల‌నే సంక‌ల్పంతో వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించిన కేసీఆర్  ఆ ఎన్నిక‌ల్లో  ఇత‌ర పార్టీల‌నుండి గెలిచిన కాంగ్రేస్‌, టీడీపీ పార్టీల‌ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని కొంద‌రికి మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు. ఇక ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2018 డిసెంబ‌ర్ 7న జ‌రిగిన‌ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 88 సీట్లలో విజయభేరీ మోగించింది. దీంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిసెంబ‌ర్ 13 గురువారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు ఏకైక మంత్రిగా మ‌హ‌ముద్ అలి హోం శాఖ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.
నేనే రాజు...నేనే మంత్రి : 
మ‌రో ఎనిమిది నెల‌ల గ‌డువు వుండ‌గానే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్ళిన కేసీఆర్ అనుకున్న‌ట్టుగానే ఈ ఎన్నికల్లో భారీ విజ‌యాన్ని సాధించాడు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రెండు వారాల్లో పూర్తి స్థాయి మంత్రివ‌ర్గం ఏర్ప‌డ‌క‌పోయినా.. మినిమం మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తారు. అనంత‌రం ద‌శ‌ల‌వారీగా వారికి అనుకూలంగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసుకోవ‌డం ప‌రిపాటి. కాని తెలంగాణ‌లో ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నంగా వుంది. ఇక్క‌డ కేసీఆర్ ఏది అంటే అదే జ‌ర‌గాలి. తెలంగాణ ఇప్పుడు పూర్తిగా ఇది నారాజ్యం ఇక్క‌డ నేనే రాజు..నేనే మంత్రి అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హారం వుంది. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన నాటి నుండి నేటి వ‌ర‌కు అంటే దాదాపు ఆరు నెల‌లుగా తెలంగాణ‌లో మంత్రులు లేకుండానే ప‌రిపాలన‌ కొన‌సాగుతుంది. ఇప్ప‌టి వ‌రకు ఇదిగో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివ‌ర‌గా ఈ నెల 19న ముహూర్తం ఖ‌రారు అయింది. ఇది కూడా పూర్తిస్థాయి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కాదు. ఎందుకంటే ఈ నెల 22న తెలంగాణ బ‌డ్జ‌ట్ స‌మావేశాలు ఉన్న నేప‌థ్యంలో మంత్రివ‌ర్గం లేని స‌భ‌లో బ‌డ్జ‌ట్ ప్ర‌వేశ‌పెట్టినట్ట‌వుతుంద‌ని ఈ కొద్దిపాటి విస్త‌ర‌ణ‌కు పూనుకున్నారు. లేదంటే ఈ ఐదు సంవ‌త్స‌రాలు కూడా మంత్రివ‌ర్గం లేని ప‌రిపాల కొన‌సాగించే సాహ‌సం గ‌ల బ‌ల్లాల దేవుడు ఈ కేసీఆర్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.
నామ‌మాత్ర‌మైన ప్ర‌తిప‌క్షం:
తెలంగాణ లో త‌న‌కు ఎదురుండ‌ద్ద‌నే ఒక పథకం ప్ర‌కారమే ఈ ఐదేళ్ల‌లో ప్ర‌తిప‌క్షంలోని స‌త్తా వున్న నాయ‌కుల‌ను త‌న పార్టీలో చేర్చుకుని ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డంలో స‌ఫ‌లం చెందాడు. ఇక తెలంగాణ‌లో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే ను సైతం త‌న పార్టీలో విలీనం చేసుకుని ఇక తెలుగు దేశం పార్టీ ఉనికి లేకుండా చేశారు. ప్ర‌స్తుతం కాంగ్రేస్ ని  అదేదారిలో పంపాల‌నే త‌న వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్న‌ట్టు తెల‌సుస్తోంది. ఏది ఏమైనా  తెలంగాణ రాజ్యంలో ఈ రాజును అడిగే ధైర్యం ఎవ‌రికీ లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే కెసిఆర్  తెలంగాణ భల్లాలదేవుడు అనడంలో అతిశయోక్తి లేదు .


 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.