(Local) Wed, 26 Feb, 2020

ఓట‌మిపై ప్ర‌క్షాళ‌ణ: భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు:

February 06, 2019,   3:13 PM IST
Share on:
ఓట‌మిపై ప్ర‌క్షాళ‌ణ: భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు:

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరప‌రాజ‌యంపై ఏఐసీసీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ ఆరా తీసారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్ళూరుతున్న‌కాంగ్రేస్ పార్టీ తెలంగాణ‌లో ఓట‌మిపాలు కావ‌డం ఒకింత నిరుత్సాహానికి  గురిచేసింద‌నే చెప్పాలి. ఎందుకంటే ద‌క్ష‌ణాది రాష్ట్రాల్లోని తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకూడా వీలైన‌న్ని ఎక్కువ సీట్లు గెల‌వాల్సిన ప‌రిస్థ‌తి. కాని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో పార్టీ బ‌తికి బట్ట‌క‌ట్టే ప‌రిస్థ‌తి లేదు. ఇక ఉన్న‌ది ఒక్క తెలంగాణ మాత్ర‌మే ఉంది. ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఆ క్రెడిట్ కూడా త‌న ఖాతాలో వేసుకోలేక పోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను నాయ‌కులు స‌రిగా ఉప‌యోగించుకోలేక పోయార‌ని నాయ‌కుల‌ను నిల‌దీసిన‌ట్టు తెలిసింది. ఓట‌మికి గల కార‌ణాల‌ను ఒక్కొక్క‌రిగా అడిగి వారి అభిప్రాయాల‌ను తెలుసుకుని దిశానిర్ధేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈవీఎం అక్రమాలు, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం వంటి కారణాలను కొందరు నేతలు, ఎమ్మెల్యేలు రాహుల్‌కి వివరించగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కేవలం డబ్బును ప్రయోగించి గెలిచారంటే తాను నమ్మబోనని, ఛత్తీ్‌సగఢ్‌లో కూడా బీజేపీ నేతలు భారీగా డబ్బు ఖర్చు పెట్టారని రాహుల్‌ అన్నారు. కేసీఆర్‌ డబ్బుతోనే గెలిచారన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వాదనను ఆయన అంగీకరించలేదు. జరిగిందేదో జరిగింది.. ఇప్పటికైనా కలిసికట్టుగా పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని సూచించారు.

పార్టీ ఓటమికి న్వ లోపం:

తెలంగాణ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ నేతలతో ఢిల్లీలో మంగళవారం రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, ప్రచార, పబ్లిసిటీ కమిటీల చైర్మన్లు విజయశాంతి, మధుయాష్కీగౌడ్ పాల్గోన్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీలోని ప‌లువురు నాయ‌కులు చెప్పిన కార‌ణాలను గ‌మ‌నించిన‌ట్ల‌యితే, నాయ‌కుల్లో స‌మ‌న్వ‌య లోపం కొట్టొచ్చిన‌ట్లే క‌న‌బ‌డుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసేందుకు బలమైన ప్రజా ఉద్యమాలను పార్టీ నిర్మించలేకపోయిందని కొందరు నేతలు అభిప్రాయ‌ప‌డ్డారు. కేవలం గాంధీభవన్‌లో మీడియా సమావేశాలకు పరిమితమయ్యారని మ‌రి కొంద‌రు ఆరోపించారు. ఇకనైనా పార్టీ తరఫున బలమైన పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందని కొంద‌రు. పార్టీ ఆర్గనైజేషనల్‌ సెట్‌పను మార్చాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పడం, నాయకులు పేర్కొనడం టీపీసీసీ అధినాయకత్వం పై వారికీ వున్న వ్యతిరేకత అర్థమవుతోంది. 

మైన నాయకుడు లేని లోపం:

ఎన్నిక‌ల గోదాలోకి దిగే ముందు ఆయా పార్టీల అధ్య‌క్షులు, నాయ‌కులు ప్ర‌త్య‌ర్థుల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు బేరీజు వేసుకుని అందుక‌నుగుణంగా ప్ర‌ణాళిక‌లు ర‌చించి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందేలా ఎన్నిక‌ల ర‌ణరంగంలో దూకాల్సి వుంటుంది. మ‌హాకూట‌మి పేరుతో టీడీపీ, సీపీఐ, తెజేస‌ల‌తో కాంగ్రేస్ పార్టీ పొత్తు కుదురుచుకుంది. కాని టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కాని ఆ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ వేస్తున్న ఎత్తుల‌కు టీపీసీసీ నాయ‌కుల వ‌ద్ద స‌మాధానం లేక‌పోయింది. ప్రభుత్వం అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్యతిరేక విధానాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్ళడంలో అధినాయ‌క‌త్వం విఫ‌లం చెందారు. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా జ‌త క‌ట్టిన మ‌హాకూట‌మిని త‌న వాక్చాతుర్యంతో తెలంగాణ సెంటిమెంట్‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డంలో గులాబి ద‌ళప‌తి స‌క్సెస్ సాధించారు. అలా కేసీఆర్‌తో పోల్చదగ్గ బలమైన నాయకుడు కాంగ్రె్‌సలో లేడని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాలు యలేదని, ఆ స్థాయిలో వ్యూహ ర‌చ‌న చేయ‌డంలోనూ స‌రైన ప్ర‌ణాళిక‌లు ర‌చించే నాయ‌కుడు క‌రువ‌య్యారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో పోటీ ప్ర‌ధానంగా  ద్రబాబుకు, కేసీఆర్‌కూ మధ్య జరిగిందని.. భావోద్వేగాలతో జనం కేసీఆర్‌కు ఓటేశారనడం ఒక ర‌కంగా టీపీసీసీ అధ్య‌క్షుడి పై నాయ‌కున్న వ్య‌తిరేక‌త తెలియ‌క‌నే చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

లిసి ట్టుగా ని చేయండి:

ఇప్పటికైనా కలిసికట్టుగా, కసిగా పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ఏఐసీసీ వ‌ర్కింగ్ ప్ర‌జిడెంట్ రాహుల్ గాంథీ సూచించారు. కేసీఆర్‌ డబ్బుతోనే గెలిచారన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిఖుంటియా వాదనను తోసిపుచ్చిన ఆయ‌న‌ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌సభ ఎన్నికల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రెండు మూడు రోజుల్లోసమావేశం కావాలని రాహుల్‌ ఆదేశించారని  తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని వారితో చెప్పినట్లు తెలిసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.